రేపు ఏప్రిల్ 2న లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
న్యూఢిల్లీ, 1 ఏప్రిల్ (హి.స.) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోత
Waqf Bill to be tabled in Lok Sabha on April 2.


న్యూఢిల్లీ, 1 ఏప్రిల్ (హి.స.)

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బిల్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ఈ బిల్లు ద్వారా ముస్లింల హక్కుల్ని హరిస్తున్నారంటూ ఆ వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇన్నా్ళ్లు వక్ఫ్ బోర్డుల ఇష్టారాజ్యానికి, అపరిమిత అధికారాలకు ఈ బిల్లు ద్వారా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 04తో ముగియనున్నాయి. అయితే, ఈ బిల్లు చట్టంగా మారాలంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande