పెళ్లై.నాలుగేళ్లు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు
విజయవాడ, 10 ఏప్రిల్ (హి.స.):పెళ్లై నాలుగు సంవత్సరాలు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు. భర్తే కాదు అత్తామామ, ఆడపడుచు కూడా ఆమెకు నరకం చూపించారు. ఎప్పటికైనా మారకపోతా అని ఆ వివాహిత ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె పట్ల అత్తంటి వారు చేసిన
పెళ్లై.నాలుగేళ్లు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు


విజయవాడ, 10 ఏప్రిల్ (హి.స.):పెళ్లై నాలుగు సంవత్సరాలు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు. భర్తే కాదు అత్తామామ, ఆడపడుచు కూడా ఆమెకు నరకం చూపించారు. ఎప్పటికైనా మారకపోతా అని ఆ వివాహిత ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె పట్ల అత్తంటి వారు చేసిన అఘాయిత్యం చూస్తే ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కుతుంది. ఈ ఘటనను చూసి సాటి ఆడపిల్లలు మాత్రం పెళ్లంటేనే భయపడకుండా ఉండలేరేమో. ఇంతకీ మహిళను అత్తంటి వారు ఏం చేశారు. ఆమె పట్ల వారు ఎలాంటి ఘోరానికి పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందా.

జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం మహిళను వేధించడమే కాకుండా ఆమెను అత్తంటివారు చంపేశారు. వివస్త్రను చేసి వేధించారు. విషయం బయటకు వస్తుందన్న భయంతో మహిళను దారుణంగా హత్య చేశారు. ఈవిషయం బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామా సృష్టించారు. జిల్లాలోని ఊటూరుకూరు మండలం పెద్దపుట్టపుపాళెలంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఓగోలు మండలం తాడిచెట్లపాలెం గ్రామానికి చెందిన సుగుణమ్మ అనే మహిళను ఊటూరుకూరు మండలం పెద్దపుట్టపుపాళెలంకు చెందిన హరికృష్ణకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆటో నడిపిస్తూ హరీకృష్ణ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి యశస్వి అనే మూడేళ్ల చిన్నారి, హేమంత్ అనే ఏడాది కుమారుడు ఉన్నాడు. అయితే వివాహ సమయంలో సుగుణమ్మ తల్లిదండ్రులు దాదాపు 17 సవర్ల బంగారం, సంవత్సరం తర్వాత 1.60 లక్షల డబ్బును వరకట్నం కింద ఇచ్చారు. అయినా కూడా అత్తింటి వారు తరచూ సుగుణమ్మను కట్నం కోసం వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న (బుధవారం) ఉదయం ఆమెను భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మీ కలిసి చాలా దారుణంగా వేధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande