అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాక
అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్


అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande