ఆవేదనతోనే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి
విజయవాడ:, 20 ఏప్రిల్ (హి.స.) ప్రమాదకర క్యాన్సర్‌ నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడ పడమటలో సిటిజన్‌ ఫోర్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆమె వర్చువల్‌గా శంకుస్థాపన చ
ఆవేదనతోనే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి


విజయవాడ:, 20 ఏప్రిల్ (హి.స.) ప్రమాదకర క్యాన్సర్‌ నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడ పడమటలో సిటిజన్‌ ఫోర్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆమె వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పామర్రు నియోజకవర్గం మూళ్లపూడిలో ఈ క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తన తల్లి బసవతారకం 1984లో క్యాన్సర్‌తో మృతి చెందారని, ఆమె పడిన బాధను కళ్లారా చూశామని ఎంపీ గుర్తుచేసుకున్నారు. ఆ ఆవేదనతోనే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటైందని చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande