మోహ‌న్‌లాల్ ‘తుడ‌రుమ్’ తెలుగు ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది
అమరావతి, 22 ఏప్రిల్ (హి.స.) మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్, దర్శకుడు తరుణ్‌ మూర్తి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘తుడ‌రుమ్’. ఈ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులో ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ చిత్రం తెలుగు ట్రైల‌
మోహ‌న్‌లాల్ ‘తుడ‌రుమ్’ తెలుగు ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది


అమరావతి, 22 ఏప్రిల్ (హి.స.)

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్, దర్శకుడు తరుణ్‌ మూర్తి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘తుడ‌రుమ్’. ఈ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులో ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ చిత్రం తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రం ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

ఇందులో మోహ‌న్ లాల్ టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇక, ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి శోభ‌న హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మోహ‌న్ లాల్, శోభ‌న కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రం కావ‌డం విశేషం. రెజపుత్ర విజువల్‌ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande