విజయవాడ, 24 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. మహేశ్ బాబు- రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చినట్లు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి సంతకం చేసి, ఫొటో దిగారు. అనంతరం అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల