వక్ఫ్ సవరణ చట్టం ఆపాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) వక్ఫ్ సవరణ చట్టం పై తెలంగాణ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆక్ట్
తెలంగాణ హైకోర్టు


హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)

వక్ఫ్ సవరణ చట్టం పై తెలంగాణ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ పిల్ దాఖలు చేశారు.వక్ఫ్ సవరణ చట్టంలో పలు సెక్షన్లను పిటిషన్ లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్.. వక్ఫ్ సవరణ చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చాక దీనిని పరిశీలిస్తామని హైకోర్ట్ కీలక నిర్ణయం వెలువరించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande