ఐపీఎల్‌ మధ్యలో ఇండియా విడిచి వెళ్లిపోయిన ఎస్ ఆర్ హెచ్ ఆటగాళ్లు! ఎందుకంటే..?
న్యూఢిల్లీ, 27 ఏప్రిల్ (హి.స.) ఒక వైపు ఐపీఎల్‌ 2025 హోరాహోరీగా సాగుతున్న క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ మొత్తం దేశం విడిచివెళ్లిపోయింది. అదేంటి టోర్నీ మధ్యలో అలా ఎలా వెళ్లిపోతారంటూ కంగారు పడకండి. మనోళ్లు వెళ్లింది.. కాస్త రిలాక్స్‌ అవ్వడానికి
Sunrisers Hyderabad's Maldives Trip: IPL 2025 Strategy or Relaxation


న్యూఢిల్లీ, 27 ఏప్రిల్ (హి.స.)

ఒక వైపు ఐపీఎల్‌ 2025 హోరాహోరీగా సాగుతున్న క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ మొత్తం దేశం విడిచివెళ్లిపోయింది. అదేంటి టోర్నీ మధ్యలో అలా ఎలా వెళ్లిపోతారంటూ కంగారు పడకండి. మనోళ్లు వెళ్లింది.. కాస్త రిలాక్స్‌ అవ్వడానికి. ఇంతకీ ఎక్కకడి వెళ్లారని అనుకుంటున్నారా? మాల్దీవులకు వెళ్లారు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్‌ మరో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ ఐదు మ్యాచ్‌లు కూడా ఎంతో కీలకమైనవి. ఆ ఐదు మ్యాచ్‌లు ఐదు గెలిస్తేనే సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. సో.. ఆ ఐదు మ్యాచ్‌లు అంత కీలక కాబట్టే.. టీమ్‌ను కాస్త కామ్‌ డౌన్‌ చేస్తూ.. ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు టీమ్‌ ఓనర్‌ కావ్య మారన్‌ జట్టు మొత్తాన్ని వెకేషన్‌ కోసం మాల్దీవులకు పంపింది.

పైగా 10వ మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండటంతో ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత బీజీ షెడ్యూల్‌లో ఆటగాళ్లకు కాస్త చిల్‌ అవ్వడానికి సమయం ఇస్తే.. వాళ్లు కాస్త ఫ్రెష్‌ మైండ్‌తో మిగిలిన మ్యాచ్‌లు ఆడి, మంచి రిజల్ట్‌ సాధిస్తారనేది కావ్య ప్లాన్‌. అది వర్క్‌ అవుట్‌ అయితే తెలుగు క్రికెట్‌ అభిమానులంతా సూపర్‌ హ్యాపీ. ఎందుకంటే.. గతేడాది అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో అదరగొట్టిన సన్‌రైజర్స్‌.. ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్‌లో కేకేఆర్‌ చేతిలో ఓటమి పాలు కావడంతో కొద్దిలో ట్రోఫీ చేజారింది. కానీ, ఈ సీజన్‌లో అలా కావొద్దని భారీగా ధర చెల్లించి కొంతమంది ఆటగాళ్లను రీటెన్‌ చేసుకుంది.

అలాగే ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం జరిగిన మెగా వేలంలో మంచి ఆటగాళ్లను పిక్‌ చేసుకొని.. ఈ సీజన్‌ కోసం రెడీ అయింది. తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌ చరిత్రలోనే సెకండ్‌ హైయెస్ట్‌ స్కోర్‌ కొట్టి.. ఈ సారి మమ్మల్ని ఆపేవాళ్లే లేరన్నట్లు ఆడింది. కానీ, ఆ తర్వాత వరుస ఓటములు చవిచూసింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటీవలె సీఎస్‌కేను వాళ్ల సొంత గ్రౌండ్‌లో ఓడించి.. ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సో.. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ చాలా క్రూషియల్‌ స్టేజ్‌కి చేరుకోవడంతో వాళ్లను కాస్త రిలాక్స్‌ చేసేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మంచి నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఇది మాల్దీవుల టూర్‌ సన్‌రైజర్స్‌కు ఎంత హెల్ప్‌ అవుతుందో.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande