చెన్నై, 5 ఏప్రిల్ (హి.స.)ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్‌తో చెపాక్‌లో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్రసింగ్ ధోనీ నడిపించనున్నట్టు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండటం అనుమానంగా ఉంది. రుతురాజ్ కనుక మ్యాచ్‌కు దూరమైతే కెప్టెన్‌గా ధోనీ జట్టును ముందుండి నడిపిస్తాడు. గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు ట్రైనింగ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అవసరమైతే ధోనీకి పగ్గాలు అప్పగిస్తామని జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ తెలిపాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి