11 Apr 2025, 23:54 HRS IST

కొత్త ఐటీ పార్కుల ప్లాన్ పై సీఎం రేవంత్ రెడ్డి కి కేటీఆర్ సూచనలు
హైదరాబాద్, 5 ఏప్రిల్ (హి.స.) కొత్త ఐటీ పార్కులను ప్లాన్ చేయడానికి ముందు తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్లో 41 శాతం క్షీణతను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు.. జనవరి-మార్చి
కేటీఆర్


హైదరాబాద్, 5 ఏప్రిల్ (హి.స.)

కొత్త ఐటీ పార్కులను ప్లాన్ చేయడానికి ముందు తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్లో 41 శాతం క్షీణతను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు.. జనవరి-మార్చి క్వార్టర్లో ఇప్పటివరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ 'కొలియర్స్ ఇండియా' విడుదల చేసిన నివేదికలో దేశంలో తొలి 3 నెలల్లో ఆఫీస్ లీజింగ్ మెరుగైన వృద్ధిని సాధించగా హైదరాబాద్, కోల్ కతాల్లో మాత్రం క్షీణత కనిపించిదని ఈ నివేదిక పేర్కొంది. దీనిపై కెటిఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ఈ తిరోగమణం దేశవ్యాప్తం జరుగుతున్నదని కాదని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్ సీఆర్, ముంబయి, పుణే వంటి నగరాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తుంటే.. హైదరాబాద్ మాత్రం తిరోగమనంలో ఉందని గుర్తుచేశారు. గతంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండేదని.. ఇప్పుడు క్షీణించడంపై ప్రభుత్వం తన పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande