గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగనున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.) గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీమ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగనుంది. కాగా 2016 ఆగష్టులో తెలంగాణ పోలీసుల ఎన్కౌంటర్లో నయీమ్ హతం అయ్యాడు. ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్త
గ్యాంగ్ స్టార్ నయీమ్ కేసు


హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)

గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీమ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగనుంది. కాగా 2016

ఆగష్టులో తెలంగాణ పోలీసుల ఎన్కౌంటర్లో నయీమ్ హతం అయ్యాడు. ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్ తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నయీమ్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ చర్యలు ప్రారంభించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande