ప్రభుత్వం అందించే మద్దతు ధరను రైతులు వినియోగించుకోవాలి. నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి
తెలంగాణ, నర్సంపేట. 18 ఏప్రిల్ (హి.స.) ప్రభుత్వం అందించే మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మందపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్న
దొంతి మాధవరెడ్డి


తెలంగాణ, నర్సంపేట. 18 ఏప్రిల్ (హి.స.)

ప్రభుత్వం అందించే మద్దతు

ధరను ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మందపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించారు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande