విజయవాడ, 19 ఏప్రిల్ (హి.స.):వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సీపీ కార్యాలయానికి ఎంపీ చేరుకున్నారు. మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది సోడిశెట్టి మన్మధ రావు హాజరయ్యారు. కాగా.. సిట్ విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అంగీకరించింది. అంతేకాకుండా విచారణకు న్యాయవాది ఆటంకం కలిగించవద్దని.. పది అడుగుల దూరంలో లాయర్ ఉండేలా అవకాశం కలిపిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల