తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద ఓ యువతి హల్ చల్
హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.) బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద ఓ యువతి హల్ చల్ చేసింది. హోటల్ ఎదురుగా ఉన్న ఓ ఐదంస్తుల భవనంపైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అయితే ఆ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ ఆస్పత్రిగా తెలుస్తోంది. అదే ఆస్
తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద ఓ యువతి హల్ చల్


హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.) బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద ఓ యువతి హల్ చల్ చేసింది. హోటల్ ఎదురుగా ఉన్న ఓ ఐదంస్తుల భవనంపైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అయితే ఆ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ ఆస్పత్రిగా తెలుస్తోంది. అదే ఆస్పత్రిలో సదరు యువతి పని చేస్తోందని, గంట సేపట్నుంచి చాలా ఆవేశంగా ఫోన్ మాట్లాడుతోందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించగా.. బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

యువతిని కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన వద్దకు ఎవరైనా వస్తే దూకేస్తానంటూ ఆమె బెదిరింపులకు దిగడంతో అక్కడంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. మరోవైపు తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. చేసింది. హోటల్ ఎదురుగా ఉన్న ఓ ఐదంస్తుల భవనంపైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అయితే ఆ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ ఆస్పత్రిగా తెలుస్తోంది. అదే ఆస్పత్రిలో సదరు యువతి పని చేస్తోందని, గంట సేపట్నుంచి చాలా ఆవేశంగా ఫోన్ మాట్లాడుతోందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించగా.. బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

యువతిని కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన వద్దకు ఎవరైనా వస్తే దూకేస్తానంటూ ఆమె బెదిరింపులకు దిగడంతో అక్కడంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. మరోవైపు తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande