హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.) కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పంపిన నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందించారు.
గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా..? చట్టం అందరికీ సమానమా..? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్