తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమత.ప్రచారం.చేస్తున్న ఉద్యోగి పై..చర్యలు
తిరుమల:, 19 ఏప్రిల్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్యమత ప్రచారం చేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఆసుంతా అన్యమతం ప్రచారం, పలు అక్రమాలకు పాల్పడినట్లు ఈవోకు సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు
తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమత.ప్రచారం.చేస్తున్న ఉద్యోగి పై..చర్యలు


తిరుమల:, 19 ఏప్రిల్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్యమత ప్రచారం చేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఆసుంతా అన్యమతం ప్రచారం, పలు అక్రమాలకు పాల్పడినట్లు ఈవోకు సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఆసుంతాపై వేటు వేశారు. ఆసుంతాను ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేస్తూ డీఈవో విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది. ఇప్పటికే టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande