విశాఖ.మైసూర్.పీఠం కూటమిదే
విశాఖపట్నం, 19 ఏప్రిల్ (హి.స.)విశాఖ జీవీఎంసీ మేయర్‌ r) గొలగాని హరి వెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరుకావడంతో అవిశ్వాసం నెగ్గారు. ఈరోజు (శనివారం) ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావ
విశాఖ.మైసూర్.పీఠం కూటమిదే


విశాఖపట్నం, 19 ఏప్రిల్ (హి.స.)విశాఖ జీవీఎంసీ మేయర్‌ r) గొలగాని హరి వెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరుకావడంతో అవిశ్వాసం నెగ్గారు. ఈరోజు (శనివారం) ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమవగా.. హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. అయితే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ముందున్న 74 మెజార్టీలో ఆఖరి నిమిషంలో ఒకరు జారుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి కూతురు ప్రియాంక చేరికతో విజయం సొంతమైంది. 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓటింగ్‌తో కూటమి విజయం సాధించింది. ఇక కూటమి నుంచి మేయర్ అభ్యర్థి రేసులో పిలా శ్రీనివాస్ ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande