వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ, మెదక్. 18 ఏప్రిల్ (హి.స.) వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, గిరిజన తండాలలో వనగండ్ల వానతో నష్ట
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి


తెలంగాణ, మెదక్. 18 ఏప్రిల్ (హి.స.)

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, గిరిజన తండాలలో వనగండ్ల వానతో నష్టపోయిన వరి పంటను శుక్రవారంపరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వనగండ్ల వానతో రైతులు ఎకరాకు సుమారు రూ. 30 వేలు నష్టపోయారని అన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నష్టపోయిన పంటలకు బీమా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పంటలతోపాటు వనగండ్ల వానకు కరెంట్ స్తంభాలు, రేకుల షెడ్లు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande