తెలంగాణ, ములుగు. 18 ఏప్రిల్ (హి.స.) భూ భారతి పైలెట్ ప్రాజెక్టును ములుగులో ప్రారంభించిన సందర్భంగా నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. అసెంబ్లీలో భూభారతి చట్టం పెట్టినప్పుడు టిఆర్ఎస్ నేతలు తీరును రాష్ట్ర ప్రజలందరూ పరిశీలించారన్నారు. మీరు చట్టం చేసినప్పుడు ఇలాంటి రెవెన్యూ సదస్సును పెట్టరా..? 2020లో కనీసం రెవెన్యూ సదస్సులో కూడా పెట్టలేని చట్టాన్ని మీరు తెచ్చారని.. ఈ భూభారతి చట్టంలో గతంలో ఉన్న తొమ్మిది లక్షల 50 వేల అప్లికేషన్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టం వ్యవహరిస్తుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు