తెలంగాణ, ములుగు. 18 ఏప్రిల్ (హి.స.) నేడు ములుగు జిల్లాలో
భూభారతి పైలెట్ ప్రాజెక్టుని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.... భూమి అనేది ఒక ఆత్మబలం, ఒక ఆదాయం.. గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసిందని అన్నారు. గతంలో నిజమైన రైతులకు గత ప్రభుత్వంలో పట్టాలు కాకుండా నష్టం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులను వాడుకొని బీఆర్ఎస్ నాయకులు వాళ్ల పేరు మీద భూములను ఎక్కించుకున్నా సందర్భాలు ఉన్నాయి. పేదవారిని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే గత పాలకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఏమి దక్కలో అది దక్కేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మంత్రి అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు