శ్రీలంకలో లోయలో పడిన బస్సు.. 21 మంది దుర్మరణం
కొలంబో, 11 మే (హి.స.) శ్రీలంకలో ఆదివారం ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడి దాదాపు 21 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.కోట్మలే మధ్య కొండ ప్రాంతం గుండా బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్
శ్రీలంక బస్సు ప్రమాదం


కొలంబో, 11 మే (హి.స.)

శ్రీలంకలో ఆదివారం ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడి దాదాపు 21 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.కోట్మలే మధ్య కొండ ప్రాంతం గుండా బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే బస్సు లోయలో పడినట్లుగా తెలిసింది. బౌద్ధ యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సులో 75 మంది వరకు ఉన్నట్లు సమాచారం. దక్షిణ యాత్రా స్థలం కటరగమ నుండి వాయువ్య పట్టణం కురునెగలకు తీసుకెళ్తుండగా కొండ చరియ నుండి 100 మీటర్ల లోతున పడిపోయిందని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో 21 మంది మరణించారని రవాణా, రహదారుల ఉప మంత్రి ప్రసన్న గుణసేన తెలిపారు. ఈ విషాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు కూడా గాయపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande