న్యూఢిల్లీ, 13 మే (హి.స.)
కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖతార్ పాలకులు డొనాల్డ్ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆ బహుమతిని స్వీకరించేందుకు ట్రంప్ తన సమ్మతి తెలిపారు. దీనిపై ప్రతిపక్ష డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. జాతీయ భద్రతకు ప్రమాదకరం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి బహుమతిని వద్దని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందన్నారు .
సోమవారం వైట్ హౌస్ వద్ద గిఫ్టుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు ఇచ్చారు. ఖరీదైన విమానాన్ని గిఫ్టుగా అందుకోవడం అనేది గొప్ప విషయంగా అభివర్ణించారు. 'వారు ఫ్రీగా జెట్ విమానం ఇస్తుంటే లేదు లేదు. నాకు ఫ్రీగా వద్దు. మీకు 1 బిలియన్ డాలర్లు లేదా 400 మిలియన్ డాలర్లు ఖరీదు కట్టిస్తా అని చెప్పాలా..? అని వ్యంగంగా ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..