సౌదీ.అరేబియాలో కోదాడకు చెందిన.వ్యక్తి అనుమానాస్పదంగా.మృతి
కోదాడ, 15 మే (హి.స.) : సౌదీ అరేబియాలో కోదాడకు చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేక్‌ తాజుద్దీన్‌ సౌదీలో పదేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 8న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి
సౌదీ.అరేబియాలో కోదాడకు చెందిన.వ్యక్తి అనుమానాస్పదంగా.మృతి


కోదాడ, 15 మే (హి.స.)

: సౌదీ అరేబియాలో కోదాడకు చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేక్‌ తాజుద్దీన్‌ సౌదీలో పదేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 8న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌదీ పోలీసులు ఆలస్యంగా తాజుద్దీన్‌ కుటుంబసభ్యులకు తెలియజేశారు. సౌదీలో కపిల్‌ అనే వ్యక్తితో తాజుద్దీన్‌కు కొద్ది రోజులుగా గొడవలున్నాయని, అతడే కాల్చి చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని కోదాడకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande