అమరావతి, 31 మే (హి.స.)
, ముమ్మిడివరం, అల్లవరం, కాట్రేనికోన: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధి సీహెచ్ గున్నేపల్లి, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామాల్లో శనివారం (ఈనెల 31) ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్యెల్యే దాట్ల బుచ్చిబాబు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గున్నేపల్లి సత్తెమ్మతల్లి గుడి ఎదురుగా ఉన్న ఓఎన్జీసీ సైట్‌లో హెలిప్యాడ్, ఉపాధిహామీ శ్రామికులతో సమావేశమయ్యే ప్రాంతం, పీ-4 పథకాన్ని ప్రారంభించే సభావేదిక పరిసరాలను పరిశీలించారు. ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, సర్వశిక్షాభియాన్ ప్రోగ్రాం సమన్వయకులు జి.మమ్మీ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్.రాజబాబు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏస్‌ఈలు పి.రామకృష్ణారెడ్డి, సీహెచ్‌ఎస్వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ