కాశ్మీర్ ప్రాంతాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. చీనాబ్ నదికి పెరిగిన వరద ప్రవాహం
జమ్మూ కాశ్మీర్, 8 మే (హి.స.) కశ్మీర్ ప్రాంతాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు మోస్తారు వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అలాగే భారీ వర్ష
కాశ్మీర్ వరదలు


జమ్మూ కాశ్మీర్, 8 మే (హి.స.)

కశ్మీర్ ప్రాంతాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు మోస్తారు వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అలాగే భారీ వర్షం కారణంగా చీనాబ్ నదికి వరద ప్రవాహం పెరిగి పోయింది. దీంతో ఆ నదిపై నిర్మించిన బాగ్లిహార్ ఆనకట్ట గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా పాకిస్తాన్ పై కఠిన చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ఈ డ్యామ్ గేట్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువకు నీరు వేగంగా ప్రవహిస్తుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande