.భారత సైన్యానికి. ప్రముఖ.నిర్మాత అల్లు.అరవింద్ విరాళాన్ని ప్రకటించారు
విజయవాడ, 9 మే (హి.స.) హైదరాబాద్‌: భారత్‌- పాక్‌ మధ్య చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (స్పందించారు. భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందన్న ఆయన.. విరాళం కూడా ప్రకటించారు. తమ బ్యానర్‌లో తెరకెక్కి, శుక్రవారం విడుదలైన ‘#సింగిల్‌’
.భారత సైన్యానికి. ప్రముఖ.నిర్మాత అల్లు.అరవింద్ విరాళాన్ని ప్రకటించారు


విజయవాడ, 9 మే (హి.స.)

హైదరాబాద్‌: భారత్‌- పాక్‌ మధ్య చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (స్పందించారు. భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందన్న ఆయన.. విరాళం కూడా ప్రకటించారు. తమ బ్యానర్‌లో తెరకెక్కి, శుక్రవారం విడుదలైన ‘#సింగిల్‌’ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడారు. ఆ సినిమా కలెక్షన్స్‌లో కొంత భాగాన్ని సైనికులకు అందజేస్తామన్నారు.

‘‘మన సైనికులు దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్‌ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాం. ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందు మేం ఈ మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటించాం. వాయిదా వేయడం మంచిదా, కాదా? అన్న దానిపై చర్చించాం. సినిమా కోసం వందల మంది పనిచేయడమే కాదు థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవరూ తప్పుగా అర్థంచేసుకోరనే ధైర్యంతో సినిమాని విడుదల చేశాం’’ అని అరవింద్‌ వివరణ ఇచ్చారు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande