చండీగఢ్ , 9 మే (హి.స.)
పెహల్గామ్ ఉద్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది భారత్.. కానీ, భారత్‌పై ఎదురుదాడికి దిగుతోంది పాకిస్తాన్.. ఓవైపు.. పాక్‌కు ప్రతిఘటిస్తూనే.. మరోసారి గట్టిసమాధానం చెబుతూ.. పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ వణికిపోయేలా చేసింది భారత భద్రతా వ్యవస్థ.. 50కి పైగా పాక్ డ్రోన్లను కూల్చివేసింది భారత్.. అయితే, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్‌లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు