యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
యూపీ, 18 జూన్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన యూపీ బులంద్హర్ జిల్లాలో జరిగింది. బుదౌన్లో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున 5.30
రోడ్డు ప్రమాదం


యూపీ, 18 జూన్ (హి.స.)

రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన యూపీ బులంద్హర్ జిల్లాలో జరిగింది. బుదౌన్లో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. హైవేపై ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ప్రమాదంలో మంటలు అంటుకున్నట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande