పాలకూరను పారేయాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ ట్రిక్‌ తో తాజాగా ఉంచండి..!
కర్నూలు, 3 జూలై (హి.స.) పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరల్లో ముఖ్యమైనది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు మన శరీరానికి అవసరమైనవే. అయితే ఇది త్వరగా వాడిపోతూ పాడయ్యే స్వభావం కలిగినది కావడం వల్ల.. ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా మంది
పాలకూరను పారేయాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ ట్రిక్‌ తో తాజాగా ఉంచండి..!


కర్నూలు, 3 జూలై (హి.స.)

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరల్లో ముఖ్యమైనది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు మన శరీరానికి అవసరమైనవే. అయితే ఇది త్వరగా వాడిపోతూ పాడయ్యే స్వభావం కలిగినది కావడం వల్ల.. ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ ఒక చిన్న ఇంటి చిట్కాతో పాలకూరను 20 నుంచి 30 రోజుల వరకు పచ్చదనంతో నిల్వచేసుకోవచ్చు. ఈ విధానాన్ని మీరు పాటిస్తే తాజా పాలకూరను పదే పదే కొనాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు.

శుభ్రంగా సిద్ధం చేసుకోవడం

ముందుగా మీరు కొన్న పాలకూరను వెంటనే శుభ్రం చేయకండి. బదులుగా వాడని తడి బట్టతో సున్నితంగా తుడవండి లేదా తక్కువ నీటిలో ముంచి ఆరబెట్టండి. పాలకూరను వేడి నీటిలో వడకట్టడం మానుకోండి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. నిల్వ చేసే ముందు పాలకూర పూర్తిగా తడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

కంటైనర్ ఎంపిక..

గాలి చొరబడని ప్లాస్టిక్ లేదా గాజు డబ్బా ఉపయోగించండి.

తేమ నియంత్రణ.. కంటైనర్ అడుగున ఒక పొర పేపర్ టవల్‌ ను మడత పెట్టి పరచండి. ఇది కూర నుండి వచ్చే తేమను పీల్చుకుని పాడైపోకుండా అడ్డుకుంటుంది.

పొరలుగా చేసుకోవడం.. పాలకూరను మార్కెట్ లో నుంచి తెచ్చిన కట్టలుగా కాకుండా.. అన్నింటిని విడదీసి మెల్లగా పొరలుగా కంటైనర్‌ లో వేయండి. ప్రతి రెండు పొరలకూ ఒక చిన్న పేపర్ టవల్‌ ను ఉంచండి.

మూసివేత.. చివరగా పాలకూరపై మరో పేపర్ టవల్ ఉంచి డబ్బాను గట్టిగా మూసివేయండి.

నిరంతర నిర్వహణ

వారానికి ఒకసారి పైన ఉన్న పేపర్ టవల్‌ ను తీసి కొత్తదానితో మార్చండి. తేమ ఎక్కువగా ఉంటే కూర తొందరగా వాడిపోతుంది. కాబట్టి తడిగా అనిపించినప్పుడు వెంటనే టవల్‌ ను మారుస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande