మాలీలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్‌ చేసిన అల్‌ఖైదా ఉగ్రవాదులు..
మాలి, 3 జూలై (హి.స.) (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌ (Kidnap)కు గురయ్యారు. ఓ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది
మాలీలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్‌ చేసిన అల్‌ఖైదా ఉగ్రవాదులు..


మాలి, 3 జూలై (హి.స.) (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌ (Kidnap)కు గురయ్యారు. ఓ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ గురువారం ధ్రువీకరించింది (Indians Kidnap in Mali).

పశ్చిమ మాలిలోని కాయెస్‌ ప్రాంతంలోని డైమెండ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంలో సాయుధ దుండగులు దాడి చేసి.. అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లాం వాల్‌ ముస్లిమిన్‌ (JNIM) ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. కిడ్నాప్‌కు గురయిన వారి వివరాలను విదేశాంగశాఖ వెల్లడించలేదు. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగశాఖ తెలిపింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande