గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముంబై, 14 ఆగస్టు (హి.స.) భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం ధరలు ఇటీవల ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువ అయ్యాయి (Gold prices). అయితే ప్రస్తుతం మళ్లీ క్రమంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ నేపథ్య
Gold


ముంబై, 14 ఆగస్టు (హి.స.)

భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం ధరలు ఇటీవల ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువ అయ్యాయి (Gold prices). అయితే ప్రస్తుతం మళ్లీ క్రమంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్ట్ 14న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 01, 340కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 92, 890కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 01, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 93, 040కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 01, 340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 92, 890కి చేరింది.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande