పాకిస్తాన్‌ను ఎవరూ నిందించడం లేదు’’..కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్.
న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.) జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతు గురించి తెలియజేయడానికి వెళ్లిన భారత దౌత్య బృందాలపై కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ని టార్గెట్ చేస
ళశఱ


న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.)

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతు గురించి తెలియజేయడానికి వెళ్లిన భారత దౌత్య బృందాలపై కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ని టార్గెట్ చేసుకున్నారు. భారత్ దౌత్య బృందాలు వెళ్లిన 33 దేశాల్లో ఏదీ కూడా పహల్గామ్ దాడికి పాకిస్తాన్‌ను నిందించలేదని అన్నారు.

‘‘థరూర్, అతడి టీమ్ సందర్శించిన 33 దేశాల్లో ఏదీ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌ను నిందించలేదు. యూఎన్, అమెరికా కూడా పాకిస్తాన్ బాధ్యులుగా ప్రకటించలేదు’’ అని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాక్ ఉందని మనము మాత్రమే చెబుతున్నామని, ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేదరని, ఈ చర్యలో పాక్ ఏం చేసిందో ప్రజలను ఒప్పించే విధంగా ఎలాంటి ఆధారాలు మనం సమర్పించలేకపోయమని మణి శంకర్ అయ్యర్ అన్నారు.

శశిథరూర్, అతడి ఫ్రెండ్స్ కోరుకున్నంత కాలం తిరుగుతారు, కానీ ఇజ్రాయిల్ తప్ప పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ ఉందని ఎవరూ చెప్పలేదని, అందరూ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు, తప్పితే ఎవరూ పాకిస్తాన్‌ని నిందించడానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande