కర్నూలు, 19 సెప్టెంబర్ (హి.స.)జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ కణాల నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ కాంతిని పెంచుతాయి. మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర నీరు బహిష్టు సమయంలో నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా ఒక నెలరోజుల పాటు తాగటం వల్ల శరీరంలో మ్యాజిక్‌లాంటి ప్రయోజనాలు కనిపిస్తాయి.
జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఇది దివ్యౌషధంగా భావిస్తారు. జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీరు జీవక్రియను పెంచుతుంది. తద్వారా కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఉబ్బరం, పేగు సమస్యలను తగ్గిస్తుంది. ఇది అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. శరీరంలో వాపు లేదా రక్తం తక్కువగా ఉన్నవారు కూడా జీలకర్ర నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి