హైకోర్టు జడ్జీలకు అలసత్వం తగదు
న్యూఢిల్లీ,23సెప్టెంబర్ (హి.స.): కొందరు హైకోర్టు న్యాయమూర్తులు బాధ్యతా నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం విచారం వ్యక్తంచేసింది. అలాంటి వారి పనితీరును సమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తాము హైకోర్టు జడ్జీల పట్ల ‘‘స్కూల్‌
Supreme Court


న్యూఢిల్లీ,23సెప్టెంబర్ (హి.స.): కొందరు హైకోర్టు న్యాయమూర్తులు బాధ్యతా నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం విచారం వ్యక్తంచేసింది. అలాంటి వారి పనితీరును సమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తాము హైకోర్టు జడ్జీల పట్ల ‘‘స్కూల్‌ ప్రిన్సిపల్‌’’లాగా వ్యవహరించాలని కోరుకోవడం లేదని, అయితే జడ్జీల డెస్కులపై ఫైళ్లు పేరుకుపోకుండా నిరోధించే స్వయంచాలిత వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘కొందరు జడ్జీలు రేయింబవళ్లూ కష్టించి కేసుల పరిష్కారంలో అద్భుత ఫలితాలందిస్తున్నారు. దురదృష్టవశాత్తూ మరికొందరు న్యాయమూర్తులు ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. దానికి కారణాలేమైనా కావచ్చు, అందుకు ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయేమో తెలీదు’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఒక న్యాయమూర్తి క్రిమినల్‌ అప్పీళ్లపై విచారణ జరుపుతున్నారని అనుకుందాం. అలాంటి సమయంలో ఆ న్యాయమూర్తి రోజుకు 50 కేసులు పరిష్కరించాలని మేం కోరుకోం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande