చెన్నై,న్యూఢిల్లీ,23సెప్టెంబర్ (హి.స.) అమెరికా విధించిన వీసా ఆంక్షలను భారత్ సద్వినియోగం చేసుకోవాలని ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. ఆయన ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసా రుసుము పెంచడంతో దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. భారత్ నుంచి చదవడానికి వెళ్లేవారు అక్కడ ఉద్యోగం చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. ఎందుకంటే అమెరికాలో విద్య ఖర్చు ఎక్కువ. వాటిని భరించడానికి ఉద్యోగాలు చేస్తారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా నుంచి తిరిగొచ్చేందుకు పలువురు భారతీయులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్న దిగ్గజ పరిశ్రమలు భారత్‌లోనూ ఉన్నాయి. ఆ దేశంతో పోలిస్తే మన దేశంలో పాలు వంటి పలు పదార్థాల ధరలు తక్కువ. ఇక్కడ తక్కువ వేతనాలు ఉన్నా చక్కగా జీవించవచ్చు. మన దేశంలోని సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్, మెడికల్ టెక్నాలజీ, మెరైన్ ఎకానమీలకు అమెరికాలో ఉన్న భారతీయుల అవసరం ఉంది. వారు ఇక్కడకు వస్తే భారత్ సద్వినియోగం చేసుకోవాలి’’ అని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ