గణపతి నిమర్జనం ఎఫెక్ట్.. కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.) గణేష్ నిమజ్జన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా వాహనాలు, గణపతులతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించగా అందరూ మెట్రోలో ప్రయాణం చే
మెట్రో రైల్


హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)

గణేష్ నిమజ్జన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా వాహనాలు, గణపతులతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించగా అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనాలంతా మెట్రోను ఆశ్రయిస్తుండటంతో మెట్రో రైళ్లు కూడా రద్దీగా మారాయి. దసరా, సంక్రాంతి వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనాలు ఎలా ఉంటారో.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో అంతకుమించిన జనాలు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande