రైతులకు యూరియా సరఫరాకు పకడ్బందీ చర్యలు.. మహబూబాబాద్ కలెక్టర్
హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం వారు సంబంధిత అధికారులతో యూరియా పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్


హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం వారు సంబంధిత అధికారులతో యూరియా పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 23,749.296, మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిపామని, ఈ రోజు 750, మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించడం జరుగుతుందని, ఇంకా వచ్చే యూరియా ను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకాలు చేయుటకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు, జిల్లాలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, మండలాల వారీగా రైతులకు ముందస్తు సమాచారంతో యూరియాను ప్రణాళిక ప్రకారం ఆన్లైన్ విధానం ద్వారా పిఓఎస్, రిజిస్టర్లు లలో నమోదు చేసి అమ్మకాలు కొనసాగించాలని, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న నిల్వలను తనిఖీ చేస్తూ కలిగి ఉన్న స్టాకును రైతులకు అమ్మకాలు చేయుటకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande