15 నెలల తర్వాత ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
‘Rice Bag’ అంటూ ఏకంగా ఏపీ హోంమంత్రి అనితపై ట్రోలింగ్
15 నెలల తర్వాత ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి


అమరావతి, 6 సెప్టెంబర్ (హి.స.)సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులపై (Trolls) ట్రోల్స్ సర్వసాధారణం. సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిన తర్వాత.. ఈ మధ్య మరింత ఎక్కువగా ట్రోలింగ్ కల్చర్ పెరుగుతోంది. ఫోటోలు మార్ఫింగ్ లేదా బుతులతో కామెంట్స్ చేస్తూ నెటిజన్‌లు వారికి నచ్చని వారిపై నెట్టింట విరుచుకపడుతారు. మంచి కోసం చేసే ట్రోలింగ్స్ కొన్ని అయితే.. పనిరాని విషయాలపై కొంత మంది నెటిజన్‌లు ట్రోల్ చేసి వైరల్ చేస్తారు. అయితే, తాజాగా ఏపీ హోంమంత్రి అనిత (Anitha Vangalapudi) సైతం ట్రోలింగ్‌కు గురయ్యారు. ట్రోల్ చేస్తోంది మరెవ్వరో కాదు.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ మద్దతుదారులు కామెంట్స్ పెట్టారు. టీచర్స్ డే సందర్భంగా మంత్రి అనిత పేరెంట్స్‌తో కలిసి దిగిన ఫోటోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మనకు తొలి ఉపాధ్యాయులు ఎవరు అంటే, మన తల్లిదండ్రులే, తల్లిదండ్రులు మనకు కేవలం జన్మనిచ్చేవారు మాత్రమే కాదు, మనకు మొదటి అక్షరం నేర్పినవారని ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు.

పోస్టుకు కింద చాలా మంది నెటిజన్‌లు పేరెంట్స్ క్రిస్ట్రియన్స్‌లా కనిపిస్తున్నారని.. ‘బియ్యపు బస్తా (Rice Bag)’ పేరుతో మంత్రి అనిత పై ట్రోల్స్ షురూ చేశారు. ఆమెని ట్రోల్ చేస్తున్న వాళ్లందరూ.. సనాతని ఫ్లాగ్స్ కలిగిన బీజేపీ మద్దతుదారులే అని నెటిజన్‌ల ప్రొఫైల్ చూస్తే తెలుస్తోంది. అయ్యో మీ కుటుంబం మొత్తం ప్రభువును నమ్ముకున్నారా? అమ్మా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. కన్వర్ట్ క్రిస్టియన్, గొర్రె బిడ్డ అంటూ హేళన చేస్తూ కామెంట్స్ పెట్టారు. మీరు క్రిస్టియన్ అయితే తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేశారా? అని మరో నెటిజన్ మంత్రిని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande