అమరావతి, 6 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో రైతులకు (urea shortage) యూరియా కొరత, రైతాంగ సమస్యలపై (YSRCP) వైఎస్సార్‌సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ నెల 9న పార్టీ రైతు పోరు బాట (farmers protest) కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా 'అన్నదాత పోరు' పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆవిష్కరించారు.
ఈ రోజు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల, పార్టీ నేతలు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని మండిపడ్డారు. రైతులు యూరియా అడిగితే బొక్కలో తొస్తానంటూ సీఎం మాట్లాడతారా? రైతులను బెదిరించడం, తొక్కుతాం, నారాతీస్తాం అంటారా? రైతులంటే అంత చిన్న చూపేంటి? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం మెడలు వంచేంత వరకు వైసీపీ పార్టీ వెనకడుగు వేయదని అన్నారు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తామని, ఈ నెల 9న ఆర్టీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి