
ముంబై, 20 జనవరి (హి.స.)
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. గత వారంలో ఏకంగా రూ.3 వేలు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ వారంలో కూడా హైక్ అవుతూనే ఉంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు షాక్‌కు గురవుతున్నారు. నిన్న బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా.. మంగళవారం కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ఇవాళ స్వల్పంగానే బంగారం ధర పెరిగింది. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,46,250 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.1,46,240గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.10 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,34,060 వద్ద కొనసాగుతోంది. సోమవారం దీని ధర రూ.1,34,050 వద్ద స్ధిరపడింది.
-
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV