
హైదరాబాద్, 04 జనవరి (హి.స.) బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై
దాడుల నేపథ్యంలో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడనియవద్దని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ (BCCI) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను రిలీవ్ చేయాలని కేకేఆర్ జట్టుకు ఆదేశించింది. ఈ మేరకు ఆ జట్టు అతన్ని రిలీవ్ చేసింది. కేకేఆర్ నిర్ణయంపై బౌలర్ ముస్తాఫిజుర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రూ. 9.20 కోట్ల భారీ ధరకు తనను కొనుగోలు చేసిన తర్వాత, కేవలం రాజకీయ కారణాలతో ఇలా తొలగించడంపై ముస్తాఫిజుర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. వదిలేయాలని వాళ్లు నిర్ణయించుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అంటూ ఆయన ఇచ్చిన సమాధానం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..