సీజేపీ కి అమెరికా నిధుల హస్తం.. అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ సంచలన ఆరోపణలు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP), మరియు విపక్షాలు చేపడుతున్న ఆందోళనల పై ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Singer


న్యూఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)

కాక్రోచ్ జనతా పార్టీ (CJP), మరియు విపక్షాలు చేపడుతున్న ఆందోళనల పై ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికాలోని కొందరు డోనర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి వ్యతిరేకంగా ఉన్న అమెరికా శక్తులే సీజేపీని వెనకుండి నడిపిస్తున్నాయని మిల్బెన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు విదేశీ నిధులతో సాగుతున్న ఈ విద్రోహ చర్యలపై మౌనంగా ఉండే సమయం ఇది కాదని మేరీ మిల్బెన్ అన్నారు. అంతర్జాతీయంగా సంప్రదాయవాద పాలకులను లక్ష్యంగా చేసుకుని, అమెరికాలో చదువుకున్న వారిని ఎంపిక చేసి, వారిని స్వదేశాలకు పంపి అశాంతి రేకెత్తించే కుట్రపూరిత విధానం నడుస్తోందని ఆమె విశ్లేషించారు. 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉంటూ వరుసగా మూడుసార్లు ఎన్నికైన ప్రధాని మోదీ ఇలాంటి కుతంత్రాలకు లొంగిపోరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం దేశభక్తులైన భారతీయ యువత మేల్కొని, సీజేపీ వంటి విధ్వంసకర శక్తులకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రతి-ఉద్యమాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande