గుజరాత్ లోని రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు దుర్మరణం
గుజరాత్ రాష్ట్రంలోని ఓ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన పేలుడు సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు
కెమికల్ ఫ్యాక్టరీ


గుజరాత్, 17 అక్టోబర్ (హి.స.)

గుజరాత్ రాష్ట్రంలోని ఓ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన పేలుడు సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. భరూచ్ జిల్లా సైఖా

జీఐడీసీ (GIDC) పరిధిలో ఉన్న ఒక రసాయన పరిశ్రమలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 'సినీల్ ఫార్మాకెమ్' (SynZeal Pharmachem) అనే ఫార్మాస్యూటికల్స్ తయారీ యూనిట్లో హైడ్రోజనేషన్ ప్రక్రియ జరుగుతుండగా సంభవించిన శక్తివంతమైన పేలుడు ధాటికి రియాక్టర్ ట్యాంక్ ముక్కలై, విడిభాగాలు ఆవరణమంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా తీవ్ర విషపూరితమైన 'మిథిలీన్ డిక్లోరైడ్' (MDC) వాయువు లీకైనట్లు పరిశ్రమల భద్రత, ఆరోగ్య శాఖ (DISH) అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి, సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande