పాదచారుల భద్రతలో విఫలం.. ఢిల్లీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఫైర్
ప్రాథమిక పాదచారులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీం కోర్ట్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Supreme court


న్యూఢిల్లీ, 17 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీలో ప్రాథమిక పాదచారులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీం కోర్ట్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలోని హైకోర్టు సమీపంలో సరైన

ఫుట్పాత్ లేకపోవడం, క్రాసింగ్ లేకపోవడంపై కోర్ట్ నేడు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఫుట్ పాత్, క్రాసింగ్ ఏర్పాటు చేయాలని లేదంటే తమ న్యాయమూర్తులే హైకోర్టు ముందు ధర్నాకు దిగుతారని అధికారులను హెచ్చరించింది. కేవలం కమిటీలు ఏర్పాటు చేయడం సరిపోదని, క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పని పూర్తికాకపోతే ధర్నా చేస్తామని, పని పూర్తయ్యే వరకు ఆ స్థలాన్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది.

తదుపరి విచారణ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. లేదంటే ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్దకు తమ న్యాయమూర్తులు వచ్చి పని పూర్తి చేసేవరకు తిరిగి ఇంటికి వెళ్లబోమని స్పష్టం చేసింది. సురక్షితమైన నడక మార్గాలు ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపింది. ఈ సందర్భంగా రహదారులపై ఆక్రమణలు లేని, సురక్షితమైన ఫుట్ పాత్లు ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande