
హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.) రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ సధిస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. దీంతో ఈ ఏడాది అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తమిళ చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ట్రేడ్ ట్రాకింగ్ సంస్థ సాక్నిల్క్ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. శుక్రవారం 'జైలర్ 2' భారత్లో రూ.35.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొత్తం 13,157 షోల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు అంచనా. భాషల వారీగా చూస్తే.. తమిళంలో రూ.25.25 కోట్లు, తెలుగులో రూ.7.25 కోట్లు, హిందీలో రూ.2.75 కోట్లు, కన్నడలో రూ.35 లక్షల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.
రెండు రోజుల్లో భారత్లో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.95.30 కోట్లకు చేరగా, గ్రాస్ వసూళ్లు రూ.112.10 కోట్లుగా నమోదయ్యాయి. విదేశాల్లో రెండో రోజు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ గ్రాస్ రూ.97 కోట్లకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.209.10 కోట్లకు పెరిగాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..