
వరంగల్, 17 అక్టోబర్ (హి.స.)
వరంగల్ నగరంలో నేడు నిర్వహించిన మారథాన్ 5K లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్, క్రెడాయ్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026 రెండో ఎడిషన్కు మంత్రి దుద్దిల్ల ముఖ్య అతిథిగా హాజరై 5K పరుగును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ కార్యక్రమం అభినందనీయమని అన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక వ్యాయామం, క్రీడలు, ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళన, ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..