కేంద్రమంత్రికిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Bhatukamma


హైదరాబాద్ , 17 అక్టోబర్ (హి.స.)తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని అంబర్పేట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆసియాలోనే అతిపెద్దదైన 72 అడుగుల భారీ బతుకమ్మను నిర్మించి వేడుకలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి ప్రత్యేక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి సాంప్రదాయ పాటలతో బతుకమ్మలాడి ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల వల్ల స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయడంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande