జవాడ రాజకీయాల్లో కొత్త మలుపు: మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన వేళ, కృష్ణా జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
Elections


అమరావతి , 17 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన వేళ, కృష్ణా జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి జనసేన పార్టీ (JSP) లోకి మారిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను, కూటమి పొత్తుల వ్యూహంలో భాగంగా విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక స్థానాన్ని జనరల్ (అన్రిజర్వ్డ్) కేటగిరీకి కేటాయించడంతో బెజవాడ పీఠంపై ఆశలు పెట్టుకున్న పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి తరఫున బలమైన అభ్యర్థిగా రాధాకృష్ణ పేరును తొలి జాబితాలోనే ఖరారు చేశారు.

విజయవాడ నగర రాజకీయాల్లో దివంగత నేత వంగవీటి మోహన రంగా వారసత్వానికి, వారి అనుచరులకు సుదీర్ఘ కాలంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత మరియు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి తెరవెనుక కీకల పాత్ర పోషించిన రాధాకృష్ణ, ఇప్పుడు ప్రత్యక్షంగా కార్పొరేషన్ ఎన్నికల క్షేత్రంలోకి దిగడం రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. ఆయన భార్య పుష్పవల్లి పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో రాధాకృష్ణ వైపే పార్టీ మొగ్గు చూపింది.

గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇక్కడ అధిక స్థానాలను దక్కించుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధా రంగంలోకి దిగడంతో ఇటు కూటమి పాత కాపులు, అటు రంగా అభిమానుల మద్దతు లభించి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడంలో రాధా ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు బెజవాడ నడిబొడ్డున ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రధాన పక్షాల మధ్య సవాల్గా మారిన ఈ మున్సిపల్ సమరంలో హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande