రైతు సమస్యలపై బిజెపి ధర్నా.. పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా లో కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు
MLA


కామారెడ్డి, 17 అక్టోబర్ (హి.స.)

రైతులకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా లో కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే రైతులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎల్ నినో ప్రభావం వల్ల విద్యుత్, నీటి కొరత వస్తుందని 6 నెలల ముందే హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వాన్ని విమర్శించడం పైనే శ్రద్ధ ఉందని, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటకు తప్పనిసరిగా నీళ్లు, నిరంతర విద్యుత్ ఇవ్వాలని, రాబోయే యాసంగి సీజన్ కు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. సరైన ప్రణాళిక లేకపోతే వ్యవసాయమే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande