స్థానిక సంస్థల ఎన్నికలు.... టీడీపీ అభ్యర్థుల పేర్లు
స్థానిక సంస్థల ఎన్నికలో తెలుగు దేశం పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Tdp


అమరావతి , 17 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలో తెలుగు దేశం పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 11 కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీల్లో పోటీకి సిద్ధమైన టీడీపీ గెలుపు గుర్రాలతో తొలిజాబితా ప్రకటించారు. 7 కార్పొరేషన్లతో పాటు 26 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలకు టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. విశాఖ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్క శ్రావణి, విజయనగరం మేయర్ అభ్యర్థిగా అవనపు భార్గవి, నెల్లూరు మేయర్ అభ్యర్థిగా పోలబోయిన రూప్ కుమార్, తిరుపతి మేయర్ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్, చిత్తూరు కార్పొరేషన్కు కటారి హేమలత, కడపకు డాక్టర్ నెల్లటూరి సువర్ణ, కర్నూలు మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూషను టీడీపీ ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయతతో పనిచేసినవారికి ఎంపికలో ప్రాధాన్యమిచ్చారు. తిరుపతి మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస ప్రసాద్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. విశాఖపట్నం, కర్నూలు మేయర్ అభ్యర్థులు గతంలో కార్పొరేటర్లుగా పనిచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande